Saturday, November 23, 2024
HomeతెలంగాణHyd: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ కుట్ర

Hyd: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ కుట్ర

బిహార్ సంస్కృతిని తెలంగాణలో తీసుకురావాలన్న ఎత్తుగడలో బీజేపీ ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎన్నో పరీక్షలు నిర్వహించినా ఏనాడు కాని లీకేజీలు ఇప్పుడే జరగడంలో బీజేపీ పెద్దల పాత్ర ఉందన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు, ఉచితకరెంట్, ఫించన్ల పథకాలతో పచ్చగా ఉన్న తెలంగాణలో పాగా వేయడానికి కమలనాథులు పథకం పన్నారంటూ మండిపడ్డారు. రాజ్యంగబద్ద పదవిలో ఉన్న సంజయ్ ముందుగా పోలీసులకు చెప్పాలి కదా అంటూ వారు ప్రశ్నించారు.

- Advertisement -

బూరం ప్రశాంత్, బండి సంజయ్ మద్య సత్సంబందాలు, బండి సూచినతోనే పేపర్ బయటకి బీజేపీ సోషల్ మిడియాలో క్షణాల్లోనే వైరల్ చేసి కుట్ర పన్ని, అర్దరాత్రి ఇంటివద్ద ఎందుకు వందల మంది ఉన్నారంటూ వారు ఆరోపించారు. ఇందులో బండి పాత్ర ఉందనే ముందస్థుగా ఏర్పాట్లు చేసుకున్నారా అంటూ మండిపడ్డ మంత్రి గంగుల, కరీంనగర్ పరువు బండి సంజయ్ తీస్తున్నారని ఆరోపించారు.

అభివ్రుద్దిలో పోటీపడడం చాతకాక చవకబారు ఎత్తుగడల్లో సంజయ్ ఉన్నారంటూ, రాష్ట్రంలోని లక్షలాది తల్లిదండ్రుల, విద్యార్థులు ఉసురుపోసుకుంటుంది బీజేపీ, టెన్త్ పేపర్ ఔట్ కుట్రలపై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తొమ్మిదిన్నర ఏళ్లలో టెన్త్ మొదలు పీజీ వరకూ, కానిస్టేబుల్ మొదలు డిప్యూటీ కలెక్టర్ వరకూ ఎన్నో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిన ప్రభుత్వం తెలంగాణ అని, కేవలం అధికార దాహంతో శాంతితో ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి, తెలంగాణ రాష్టంలో అలజడి సృష్టించి తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై అప్రతిష్ట చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్.

కరీంనగర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అధికారం కోసం బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలే రాష్ట్రంలో తాజా అలజడికి కారణమన్నారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి చట్టాన్ని గౌరవించని వ్యక్తి బండి సంజయ్ అని, తనకు వచ్చిన ప్రశ్నాపత్రంపై మొదట పోలీసులకు సమాచారం అందించాల్సిన బాధ్యత లేదా అని బండి సంజయ్ని ప్రశ్నించారు మంత్రి గంగుల. బీజేపీకి సంబందించిన గ్రూపులు, సోషల్ మీడియాలో వేగంగా వైరల్ చేయడం వెనుక బీజేపీ కుట్ర స్పష్టంగా బైటపడుతుందన్నారు. లీక్ కాకుండా బయటకొచ్చిన పేపర్ని లీకేజీ అంటూ వైరల్ చేయడం కుఠిల రాజకీయాలకు నిదర్శనమని. బీజేపీ గ్రూపుల నుండే ఎందుకు ఎక్కువగా సర్క్యులేట్ అయ్యాయని ప్రశ్నించారు. ఈరోజు లక్షలాది తెలంగాణ తల్లిదండ్రుల, విద్యార్థుల ఉసురు ఖచ్చితంగా బీజేపీకి, బండి సంజయ్కి తగులుతుందన్నారు, రాష్ట్రంలో బీజేపీ జెండా పట్టే వాళ్లు లేరని ఆ అక్కసుతోనే యువతను బీజేపీ వైపు మలుచుకోవాలని తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు, అందుకోసమే గతంలో స్వయంగా బండి సంజయ్ ఎన్నికల టైంలో ఉద్యోగాలెలా ఇస్తారని ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేసారు. లీకేజీ ఘటనల్లో ప్రభుత్వానికి ఎక్కడా సంబందం లేదన్న మంత్రి గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి ఘటనలు లేవని గుర్తుచేసారు, తెలంగాణను మరో బీహార్గా చేయడానికి బండి సంజయ్, బీజేపీ కుట్రపన్నిందని, బీహార్ సంస్క్రుతిని రాష్ట్రానికి తెస్తూ గుండాయిజాన్ని, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి గంగుల.
ఈ నీచ కుట్రలతో బండి సంజయ్ కరీంనగర్ పరువుతీస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ క్రుషితో వేలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, వేలాది ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, వలసల రివర్స్, పాడిపంటల్లో రికార్డులు, నీళ్లు, నిధులు, కరెంటు తీసుకొస్తుంటే, గతంలో కాంగ్రెస్ అభద్రతా బావం స్రుష్టించినట్టే ఇప్పుడు బీజేపీ చేస్తుందన్నారు.
అభివ్రుద్దిలో పోటీపడాలి కానీ ఇలాంటి విషసంస్కృతిని తీసుకురావడం సమంజసమేనా అని బండిని ప్రశ్నించారు, కరీంనగర్ డెవలప్మెంట్లో, సీసీరోడ్లలో, సెంట్రల్ లైటింగ్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ తీసుకురావడంలో ఇతరత్రా అభివ్రుద్ది పనుల్లో పోటీ పడదామని, ఇలాంటి జుగుప్సాకరమైన సంఘటనల్లో కాదన్నారు మంత్రి గంగుల. బోరం ప్రశాంత్ కు టీఆర్ఎస్ పార్టీల నేతలతో సంబందాలు ఉన్నాయని మాట్లాడుతున్న బీజేపీ నేతలు, మరి ప్రశ్నాపత్రాలను నిందితుడు కేవలం బండి సంజయ్కే ఎందుకు పంపారని ప్రశ్నించారు. బీజేపీ లీకేజీ మిషన్ సక్సెస్ అనే సంకేతాన్ని బండిసంజయ్కి పంపడం కాక ఇది మరోటి కాదన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ సమావేశంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామక్రుష్ణారావు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News