మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటి నుంచే న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరమంతా సిద్ధమవుతోంది. భారీ ఈవెంట్లు నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. లేదంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
- Advertisement -
పోలీసుల మార్గదర్శకాలు..
- ఈవెంట్ వేదికల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- అసభ్యకర, అశ్లీల డ్యాన్స్‌లకు అనుమతి లేదు.
- రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లకు నో ఛాన్స్.
- బార్లు, పబ్‌లలో మైనర్లకు నో ఎంట్రీ.
- డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు.
- డ్రంకెన్ డ్రైవింగ్ చేస్తూ దొరికితే రూ. 10 వేల వరకు జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష