Saturday, November 15, 2025
HomeతెలంగాణANTI-ENCROACHMENT DRIVE: హైదరాబాద్‌లో బుల్డోజర్ల జోరు.. బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం!

ANTI-ENCROACHMENT DRIVE: హైదరాబాద్‌లో బుల్డోజర్ల జోరు.. బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం!

Hyderabad land encroachment drive : భాగ్యనగరంలో భూకబ్జాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొండాపూర్‌లో వేల కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న కొద్ది రోజులకే, హైదరాబాద్ డెవలప్‌మెంట్ అండ్ రివైటలైజేషన్ అథారిటీ (హైడ్రా) మరోసారి బుల్డోజర్లతో గర్జించింది. అత్యంత ఖరీదైన బంజారాహిల్స్‌లో, ఏకంగా రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. అసలు ఈ భారీ కబ్జా వెనుక ఉన్నదెవరు..? ప్రభుత్వ భూమిని కాపాడటంలో హైడ్రా వ్యూహమేంటి..?

- Advertisement -

షేక్‌పేట్ మండలం, బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై పార్థసారథి అనే వ్యక్తి కన్నేశాడు.

నకిలీ పత్రాలతో కబ్జా: ఈ భూమిలో 1.20 ఎకరాలు జలమండలికి కేటాయించగా, ఆ భూమితో పాటు మొత్తం 5 ఎకరాలు తనదేనంటూ, నకిలీ సర్వే నంబర్ (403/52), రిజిస్టర్ కాని సేల్ డీడ్‌తో కోర్టును ఆశ్రయించాడు.

బౌన్సర్లు, వేట కుక్కలతో పహారా: కోర్టులో వివాదం నడుస్తుండగానే, ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, బౌన్సర్లు, వేట కుక్కలతో పహారా కాశాడు. అక్రమంగా షెడ్లు నిర్మించి, దానిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చాడు.

ప్రభుత్వ పనులకు అడ్డు: ఆ ప్రాంతంలో తాగునీటి రిజర్వాయర్ నిర్మించాలన్న జలమండలి ప్రయత్నాలను కూడా అడ్డుకున్నాడు.

హైడ్రా ఎంట్రీ.. కూల్చివేతల పర్వం : పార్థసారథి ఆగడాలపై జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో, హైడ్రా రంగంలోకి దిగింది.
భారీ బందోబస్తుతో కూల్చివేత: పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో, భారీ బందోబస్తు నడుమ, హైడ్రా సిబ్బంది అక్కడి ఫెన్సింగ్, అక్రమ షెడ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు.

ప్రభుత్వ బోర్డు ఏర్పాటు: అనంతరం, ఆ 5 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, అది ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ అధికారిక బోర్డులను ఏర్పాటు చేశారు.

కొనసాగుతున్న కూల్చివేతలు : హైడ్రా చర్యలు కేవలం బంజారాహిల్స్‌కే పరిమితం కాలేదు.
పెద్ద అంబర్‌పేట్: తట్టిఅన్నారంలోని లక్ష్మీగణపతి కాలనీలో 700 గజాల పార్కు స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల భూమి: వారం రోజుల క్రితం, కొండాపూర్‌లోని 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను తొలగించి, రూ.3,600 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణల నుంచి ప్రభుత్వ భూములను కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంతో, తమ కూల్చివేతల పరంపర కొనసాగుతుందని హైడ్రా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad