Tuesday, September 10, 2024
HomeతెలంగాణHyderabad Duty Free: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో బిగ్ డ్యూటీ ఫ్రీ కొత్త స్టోర్

Hyderabad Duty Free: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో బిగ్ డ్యూటీ ఫ్రీ కొత్త స్టోర్

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కొత్తగా ప్రారంభించిన అంతర్జాతీయ అరైవల్స్ ప్రాంగణంలో కొత్త స్టోర్ ను ప్రారంభించారు. 2,400 చ.మీలకు పైగా విస్తరించిన ఈ కొత్త స్టోర్ ఇండియాలోనే అతి పెద్ద అరైవల్ డ్యూటీ ఫ్రీ స్టోర్ లలో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ ప్రపంచంలోనే బెస్ట్ బ్రాండ్ పర్ఫ్యూమ్స్, కాస్మిటిక్స్, సన్ గ్లాసెస్, వాచెస్, స్వీట్స్, ట్రావెల్ ఎసెన్షియల్స్ లాంటి ఎన్నో వస్తువలను ఇక్కడ సేల్ చేస్తోంది. బెస్ట్ ఇన్ క్లాస్ బ్రాండ్స్, ఆఫర్స్, బెస్ట్ షాపింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చేలా ఈ కొత్త స్టోర్ ఉందని GHIAL CEO ప్రదీప్ పణికర్ వెల్లడించారు.

- Advertisement -

హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ కొత్త స్టోర్స్ ను డిపార్చర్, అరైవల్స్ రెంటిలోనూ ప్రారంభించేందుకు, మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సరికొత్తగా సిద్ధమవుతూ, విమాన ప్రయాణికులను మరింత ఆకట్టుకునే ప్రయత్నంలో జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ ఉంది. తమకు కావాల్సిన వస్తువులను ముందే ఆన్ లైన్లో బుక్ కూడా చేసుకునే సదుపాయం ఇక్కడ ఉంది. క్లిక్ అండ్ కలెక్ట్ సౌకర్యంతో ఏకంగా 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News