Friday, November 8, 2024
HomeతెలంగాణHyderabad exhibition launched by CM Revanth: 'హైదరాబాద్ కా నిషాన్ నుమాయిష్' :...

Hyderabad exhibition launched by CM Revanth: ‘హైదరాబాద్ కా నిషాన్ నుమాయిష్’ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మాస్క్ కంపల్సరీ

‘హైదరాబాద్ కా నిషాన్ నుమాయిష్’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్.. ట్యాంక్ బండ్ తరువాత గుర్తొచ్చేది నుమాయిష్ అని పేర్కొన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 83వ నుమాయిష్ ను ప్రారంభించిన తర్వాత సీఎం సభనుద్దేశించి ప్రసంగించారు. ప్రతీ ఏటా నుమాయిష్ ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీని సీఎం ఈ సందర్భంగా అభినందించారు.

- Advertisement -

సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సామాజిక బాధ్యతతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నా ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చేందుకు నుమాయిష్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News