Thursday, July 4, 2024
HomeతెలంగాణHyd: 'రాజ్ భాష' హిందీ అమలుపై రివ్యూ

Hyd: ‘రాజ్ భాష’ హిందీ అమలుపై రివ్యూ

హిందీ అమలులో వేగం, పురోగతి ఉండాల్సిందే

బ్యాంకుల్లో అధికార భాషైన హిందీ అమలుపై అర్ధవార్షికోత్సవ సమావేశం హైదరాబాద్ లో ఘనంగా సాగింది. అధికార భాషను నేర్చుకోవటం, అమలు చేయటంపై ఈ భేటీ విస్తృతంగా చర్చించింది.

- Advertisement -

అధికారిక భాషా అమలు సమితి (బ్యాంక్ & ఇన్సూరెన్స్) 2024-25 సంవత్సరానికి హైదరాబాద్ మొదటి అర్ధ సంవత్సరం సమావేశం 28 మే 2024న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్థానిక ప్రధాన కార్యాలయం, హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ అధ్యక్షత వహించారు. అనిర్బన్ కుమార్ బిస్వాస్, డిప్యూటీ డైరెక్టర్ (ఇంప్లిమెంటేషన్), హోం మంత్రిత్వ శాఖ, రాజేష్ మహానా, జనరల్ మేనేజర్ – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డా. కె.వి.ఎస్. ప్రసాద్, జనరల్ మేనేజర్, నాబార్డ్ (ఆంధ్రప్రదేశ్), ఓం నారాయణ శర్మ, చీఫ్ జనరల్ మేనేజర్-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్థానిక ప్రధాన కార్యాలయం, అమరావతి హాజరయ్యారు.

టీఓఎల్ఐసీ (TOLIC) సభ్య కార్యదర్శి-అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అధికారిక భాష) అజయ్ కుమార్ తివారీ స్వాగత ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. కార్యాలయాల్లో అధికార భాష అమలు తీరుపై సమీక్షించారు. చీఫ్ జనరల్ మేనేజర్ & బ్యాంక్ టీఓఎల్ఐసీ ప్రెసిడెంట్ రాజేష్ కుమార్ అన్ని కార్యాలయాలకు మార్గనిర్దేశం చేశారు. రాజ్‌భాషా అమలులో వేగాన్ని కొనసాగించి, నిరంతర పురోగతిని సాధించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

హిందీ అమలు కోసం మన ఆలోచనలు, ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని, వచ్చే అర్ధ సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. గత అర్ధ సంవత్సరంలో వివిధ హిందీ పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులతో సత్కరించారు. అధికార భాషా అమలుకు సంబంధించిన రికార్డుల నిర్వహణ, డేటా విషయంలో సీరియస్ గా ఉండాలన్నారు.

ఈ క్రమంలో రాజ్‌భాషా షీల్డ్‌తో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు సభ్యుల కార్యాలయాలను సత్కరించారు. దీని కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అమరావతి), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, SIDBI, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, నాబార్డ్-తెలంగాణ హిందీలో ఉత్తమ ప్రదర్శనకు అవార్డు పొందాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News