Sunday, December 8, 2024
HomeతెలంగాణHyderabad: యశోద హాస్పిటల్స్ లో LAP-URO-2024 అడ్వాన్స్ డ్ లాపరోస్కోపిక్, రోబోటిక్ ట్రీట్మెంట్

Hyderabad: యశోద హాస్పిటల్స్ లో LAP-URO-2024 అడ్వాన్స్ డ్ లాపరోస్కోపిక్, రోబోటిక్ ట్రీట్మెంట్

యూరాలజీ ప్రొసీజర్లపై అత్యాధునిక కాస్కేప్

యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో లాపరోస్కోపిక్ నుండి రోబోటిక్ సహాయక సర్జరీల వరకు (Eurology) కిడ్నీ సంబంధిత వ్యాధులు, వాటికి అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్యవిధానాలపై అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ LAP-URO’24 పేరుతో రూపొందించబడిన ఒక ప్రీమియర్ సైంటిఫిక్ అప్డేట్ ప్రోగ్రామ్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ లో యూరాలజీ వైద్యరంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పురోగతిని ప్రదర్శిస్తూ అగ్రశ్రేణి జాతీయ యూరాలజిస్టులను ఒకచోట చేర్చింది. ఇందులో లైవ్ ఆపరేటివ్ సెషన్లు, ప్యానెల్ డిస్కషన్లు, వర్చువల్ ట్రైనింగ్ మాడ్యూల్స్, ఆధునిక యూరాలజికల్ ఇన్నుమెంట్ల హ్యాండ్-ఆన్ ప్రదర్శనలతో విజయవంతం చేయబడింది.

- Advertisement -

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్, సీనియర్ యూరాలజిస్ట్ & కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్, డాక్టర్. గుత్తా శ్రీనివాస్, LAP-URO’24 గురించి మాట్లాడుతూ.. ఈ సదస్సులో పీడియాట్రిక్ యూరాలజీ, యూరో- అంకాలజీ, రీకన్పక్టివ్ యూరాలజీ మరియు రీనల్ ట్రాన్స్పాంటేషన్లో ఆవిష్కరణలపై దృష్టి సారించడం జరిగింది. ప్రొఫెసర్ డాక్టర్. అనంత్ కుమార్, డాక్టర్. అరవింద్ గన్పూలే, డాక్టర్, జమాల్ రిజ్వీ మరియు డాక్టర్. శ్రీహర్ష వంటి నిపుణులతో సహా హాజరైన వారు, రాడికల్ ప్రొస్టిటెక్టమీ నుండి మూత్రపిండ మార్పిడి వరకు, యూరాలజికల్లో కొత్త బెంచ్మార్క్లను సెట్ చేయడం వరకు కీలకమైన అంశాలపై లోతైన చర్చలు జరిగాయన్నారు. ఈ సదస్సులో లాపరోస్కోపిక్ సింపుల్ నెప్రెక్టమీ, రెట్రో-పెరిటోనియోస్కోపిక్ నెప్రెక్టమీ, అడ్రినలెక్టమీ మరియు రోబోటిక్ ప్రెస్టిటెక్టమీ వంటి అనేక రకాల ప్రత్యక్ష శస్త్రచికిత్సలు ఉన్నాయి. శస్త్రచికిత్సా విధానాలను మార్చడంలో, వాటిని సురక్షితంగా మరియు మరింత ప్రభావవంతంగా చేయడంలో ఆధునిక సాంకేతికత పాత్రను చర్చలు మరింత నొక్కిచెప్పాయని, డాక్టర్. గుత్తా శ్రీనివాస్ తెలిపారు.

ప్రొఫెసర్ డాక్టర్. అనంత్ కుమార్ ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ… లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు యూరాలజీలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నాయని, రోగులకు మరింత ఖచ్చితత్వం, మెరుగైన ఫలితాలు, మెరుగైన జీవన నాణ్యతను అందిస్తున్నయన్నారు. LAP-URO’24 వంటి సదస్సులు నైపుణ్యం నిరంతర అభివృద్ధికి రోజువారీ ఆచరణలో తాజా సాంకేతికతను చేర్చడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News