Saturday, November 15, 2025
HomeతెలంగాణWeather Update: దడ పుట్టిస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు అలర్ట్!

Weather Update: దడ పుట్టిస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు అలర్ట్!

Heavy rains Forecast for telugu states: తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -

బంగాళాఖాతంలో బలపడనున్న అల్పపీడనం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రైతులకు, ప్రజలకు వర్ష సూచనతో పాటుగా వాతావరణ బులెటిన్ జారీ చేసింది. సోమవారం సాయంత్రం బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి.. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కానుందని అధికారులు తెలిపారు. తాజాగా మరో అల్పపీడనం ఈ నెల 25 న తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 27న దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read:https://teluguprabha.net/telangana-news/parental-vigilance-children-safety-dasara-holidays-reservoirs/

ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు: రాష్ట్రంలో భారీ వర్షాలు కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై నీరు భారీగా నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షాలు మరో కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రోజు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad