Thursday, April 3, 2025
HomeతెలంగాణHyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఓ బ్రాండ్, అవార్డుల పంటతో ప్రతిధ్వనించిన HMRL ఇమేజ్

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఓ బ్రాండ్, అవార్డుల పంటతో ప్రతిధ్వనించిన HMRL ఇమేజ్

హైదరాబాద్ మెట్రోకు అవార్డుల పంట పండింది. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ హైదరాబాద్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పీఆర్ఎస్ఐ నేషనల్ అవార్డులు దక్కాయి. 2022 ఏడాదిగానూ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ యాక్షన్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది మన హైదరాబాద్ మెట్రో. బెస్ట్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ (ఎక్సటర్నల్ పబ్లిక్స్) విభాగంలో రెండవ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మంగుభాయ్ ఛాంగ్ బాయ్ పటేల్ చేతుల మీద ఈ అవార్డు ట్రోఫీలను L&T MRHL కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అనిందిత సిన్హా అందుకున్నారు. ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ లో అవార్డుల ప్రదానం సాగింది.

- Advertisement -

“ఈ అవార్డులు మా నిరంతర ప్రయత్నాలకు నిదర్శనంగా ఉంటాయి, హైదరాబాద్ మెట్రో రైల్ లో జరుగుతున్న అభివృద్ధి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేయడంతో పాటు ఈ ప్రయాణంలో వారిని భాగస్వాములు చేస్తున్నాము. వారి అభిప్రాయాలను, అనుభవాలను పరిగణలోకి తీసుకుని మా బ్రాండ్ ప్రతిధ్వనించేలా చేస్తున్నాం” .. అని L&T MRHL ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News