హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. మెట్రో టికెట్(Metro Tickets) ధరలను అధికారులు పెంచారు. ఈనెల 17 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది.
- Advertisement -
కాగా హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం రోజుకు 1200 సర్వీసులు నడుస్తుండగా.. 4.80లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాల్లో, సెలవు రోజుల్లో 5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో రైల్వే (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్ 2002 ప్రకారం టికెట్ రేట్లను సవరించినట్లు అధికారులు తెలిపారు.