Saturday, November 15, 2025
HomeతెలంగాణMetro Timings: మెట్రో ప్రయాణికులకు అలర్ట్: మారిన రైలు వేళలు.. ఇకపై చివరి ట్రిప్ ఎప్పుడంటే?

Metro Timings: మెట్రో ప్రయాణికులకు అలర్ట్: మారిన రైలు వేళలు.. ఇకపై చివరి ట్రిప్ ఎప్పుడంటే?

Hyderabad Metro last train timings : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ముఖ్య గమనిక. మీరు రోజూ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? రాత్రి వేళ ఆలస్యంగా ఇళ్లకు వెళ్తుంటారా? అయితే ఈ వార్త మీకోసమే. నగరవాసుల ప్రయాణంలో కీలకమైన మెట్రో రైలు వేళల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై చివరి రైలు సమయం ముందుకు జరగనుంది. మరి ఆ కొత్త సమయాలేంటి? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? పాత సమయాలతో పోలిస్తే వచ్చిన మార్పేమిటి?

- Advertisement -

మారిన వేళలు : హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసు వేళలను మారుస్తున్నట్లు ఎల్&టీ మెట్రో యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 3వ తేదీ నుంచి ఈ కొత్త సమయాలు అమల్లోకి వస్తాయి.

కొత్త సమయాలు..
మొదటి రైలు: వారంలోని అన్ని రోజుల్లో (ఆదివారంతో సహా) అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది.
చివరి రైలు: వారంలోని అన్ని రోజుల్లో అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది.

పాత సమయాలతో పోలిస్తే..
గతంలో మెట్రో వేళలు వారంలోని రోజుల ఆధారంగా వేర్వేరుగా ఉండేవి.
సోమవారం – శుక్రవారం: మొదటి రైలు ఉదయం 6 గంటలకు, చివరి రైలు రాత్రి 11:45 గంటలకు ఉండేది.
శనివారం: మొదటి రైలు ఉదయం 6 గంటలకు, చివరి రైలు రాత్రి 11 గంటలకు ఉండేది.
ఆదివారం: మొదటి రైలు ఉదయం 7 గంటలకు, చివరి రైలు రాత్రి 11 గంటలకు ఉండేది.

తాజా మార్పుతో, సోమవారం నుంచి శుక్రవారం వరకు చివరి ట్రిప్ సమయాన్ని 45 నిమిషాల పాటు కుదించారు. అదేవిధంగా, ఆదివారం కూడా మొదటి రైలు మిగతా రోజుల మాదిరిగానే ఉదయం 6 గంటలకే ప్రారంభం కానుంది. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి గందరగోళం లేకుండా వారంలోని ఏడు రోజులూ ఒకే రకమైన సమయపాలన అమల్లో ఉంటుంది. ఈ మార్పులను ప్రయాణికులు గమనించి, తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని మెట్రో యాజమాన్యం సూచించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad