Wednesday, October 30, 2024
HomeతెలంగాణHyderabad : కొత్త ట్రాఫిక్ రూల్స్.. అతిక్రమిస్తే జేబుకు చిల్లే..జాగ్రత్త

Hyderabad : కొత్త ట్రాఫిక్ రూల్స్.. అతిక్రమిస్తే జేబుకు చిల్లే..జాగ్రత్త

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. నగరంలో ట్రాఫిక్ రూల్స్ మారాయి. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అల్టిమేటం ఇది. ఇకపై మరింత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయకపోతే.. జేబుకు చిల్లు పడటం ఖాయం. రూల్స్ అతిక్రమిస్తే జరిమానాల వడ్డన అలా ఉంది మరి. నగరంలో జరుగుతున్న రోడ్డుప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కి, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.

- Advertisement -

హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారికి మోటారు వెహికిల్ చట్టంలోని సెక్షన్ 119/ 177 & 184 కింద రూ.1700, ట్రిపుల్ రైడింగ్ కి రూ.1200 జరిమానాలు వడ్డించనున్నారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ నవంబర్ 28 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ నెల 21 నుండి రాంగ్ సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ తెలిపారు.

2020లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా, ట్రిపుల్ రైడింగ్ వల్ల జరిగిన ప్రమాదాల్లో 24 మంది చనిపోయారు. 2021లో డేటాను పరిశీలిస్తే.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 21 మంది చనిపోగా.. ట్రిపుల్ రైడింగ్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో 15 మంది దుర్మరణం చెందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News