Hyderabad Police arrest 2 Persons in Foreign Liquor Case: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ సందర్బంగా నియోజకవర్గంలో ఎలక్షన్ ఫ్లయింగ్, స్టాటిక్ టీమ్స్ చెకింగ్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున విదేశీ మద్యం పట్టుబడటం కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జూబ్లీహీల్స్‌కు చెందిన సుమీత్ అనే వ్యక్తి ట్రావెల్ ఎజెంట్. చాలా మంది ట్రావెలర్స్‌ను విదేశాలకు పంపిస్తు ఉంటాడు. వారు వెళ్లినపుడు కొందరితో అక్కడి నుంచి విదేశీ మద్యాన్ని తెప్పించుకునేవాడు. విదేశాల నుంచి వచ్చిన లీటర్ మద్యం బాటిళ్లను హైదరాబాద్‌లో బడాబాబులకు విక్రయిస్తున్నాడు. విదేశీ మద్యం అంటు ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నాడు. ట్రావెల్ ఏజెంట్ సుమీత్ తెప్పించిన విదేశీ మద్యం బాటిళ్లను మూర్తి యుగేందర్ టూ వీలర్‌పై బోరబండా ప్రాంతంలో అమ్మకాలకు ప్రయత్నాలు చేస్తుండగా హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ సిబ్బంది కలిసి దాడి చేసి పట్టుకున్నారు. మూర్తి యుగేందర్ వద్ద తొమ్మిది మద్యం బాటిళ్లను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. ఈ బాటిళ్లను ఎక్కడి నుంచి తీసుక వచ్చావు అని నిందితుడిని ప్రశ్నించాగా.. మనీష్ కుమార్ ఇచ్చాడని నిందితుడు పోలీసులకు తెలిపాడు. దీంతో, నిందితుడితో పాటు మనీష్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
52 విదేశీ మద్యం బాటిళ్ల స్వాధీనం..
మూర్తి యుగేందర్ ఇచ్చిన మాచారం మేరకు మనీష్ కుమార్ ఇంట్లో, కారులో తనిఖీలు నిర్వహించగా మరో 43 విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి. ఈ విదేశీ మద్యం బాటిళ్ల ఎక్కడి నుంచి తెప్పించారు అని మనీష్ కుమార్‌ను పోలీసులు ప్రశ్నించగా.. సుమీత్ ట్రావెల్ ఎజెంట్ మద్యం బాటిళ్లను విదేశాల నుంచి ఎయిర్ పోర్ట్ నుంచి తెప్పించి ఇస్తాడని.. మా కస్టమర్ల అమ్మకాలకు జరుపుతామని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో, ట్రావెల్ ఏజెంట్ సుమీత్‌పై కూడా కేసు నమోదు చేశారు. బుధవారం, ఈ ఇద్దరు నిందితులను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, టూవీలర్ తోపాటు 52 మద్యం విదేశీ లీటర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం, కారు కలిపి రూ. 6 లక్షల విలువ చేస్తుందని అంచనా వేశారు. విదేశీ మద్యం పట్టుకున్న టీమ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్, ఎస్సై శ్రీనివాస్, కానిస్టెబుళ్లు కరణ్‌సింగ్, శ్రీకాంత్, సాయి కుమార్, గోపాల్, ప్రసాద్‌లు పాల్గొన్నారు. విదేశీల మద్యం అమ్మకాల ముఠాను పట్టుకున్న టీమ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం, డిప్యూటి కమిషనర్ అనిల్‌కుమార్ రెడ్డి, ఏఈఎస్ స్మిత సౌజన్య అభినందించారు.


