Saturday, November 16, 2024
HomeతెలంగాణHyderabad | ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్

Hyderabad | ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్

హైదరాబాద్ (Hyderabad) ఫుడ్ కి ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫుడ్ లవర్స్ కి హైదరాబాద్ అడ్డా అని చెప్పొచ్చు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ మూల నుంచి వచ్చిన వారికైనా అదిరిపోయే ఫుడ్ తో మంచి ఆతిథ్యం ఇవ్వగలిగే సత్తా హైదరాబాద్ కి ఉందని గొప్పగా చెప్పుకుంటాం. అరబ్ నుంచి వచ్చి హైదరాబాద్ పాపులర్ డిష్ అయిపోయిన బిర్యానీ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు వెజ్, నాన్ వెజ్ ఏదైనా సరే… హైదరాబాద్ రెస్టారెంట్ల టేస్ట్ ని బీట్ చేసే చోటే ఉండదని గర్వంగా కాలర్ ఎగరేస్తాం. కానీ హైదరాబాదీయులంతా షాకయ్యే సర్వే ఇప్పుడు మన ఇజ్జత్ తీసేసింది. ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్ లో ఉంది.

- Advertisement -

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ (Hydearabad) బ్రాండ్ ఘోరంగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్ నిలిచింది. సిటీలోని హోటల్స్, రెస్టారెంట్లు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని సర్వేలో వెల్లడైంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే తో GHMC ఫుడ్ సేఫ్టీ విభాగం మరింత అలర్ట్ అయింది. మార్పు వచ్చే వరకూ హోటల్స్, రెస్టారెంట్లపై దాడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఇజ్జత్ కా సవాల్ మరి. హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ నిలబడాలంటే అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిందే… రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News