Saturday, April 5, 2025
HomeతెలంగాణHyderabad Accident: టిప్పర్ బీభత్సం.. నుజ్జు నుజ్జయిన కార్లు, బైకులు!

Hyderabad Accident: టిప్పర్ బీభత్సం.. నుజ్జు నుజ్జయిన కార్లు, బైకులు!

- Advertisement -

Hyderabad Accident: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్ దగ్గర టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడడంతో ఆగిన కార్లు బైకులు మీదికి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు, రెండు బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి. అంతేకాదు ఐదుగురు గాయపడగా ఒకరు మృతి చెందారు.

టిప్పర్ గుద్దడంతో ప్రమాదం జరిగిన స్థలంలోనే నజీర్ అనే స్విగ్గి డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అబ్దుల్ అనే ఒక విద్యార్థికి కాలు విరిగింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చేరవేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా టిప్పర్ వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయని.. దాని వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News