Sunday, November 16, 2025
HomeతెలంగాణRTA AUCTION: ఒక్క నంబర్‌కు రూ.25 లక్షలు.. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రికార్డు మోత!

RTA AUCTION: ఒక్క నంబర్‌కు రూ.25 లక్షలు.. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రికార్డు మోత!

Hyderabad RTA fancy number auction : సెంటిమెంట్.. స్టేటస్ సింబల్.. ఏ పేరు పెట్టినా, ఫ్యాన్సీ నంబర్లపై హైదరాబాదీలకు ఉన్న మోజు అంతా ఇంతా కాదు. వాహనం ధర ఎంతైనా, నచ్చిన నంబర్‌ కోసం లక్షలు కుమ్మరించడానికి వెనుకాడరు. ఈ క్రేజ్‌ను మరోసారి నిరూపిస్తూ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఆర్‌టీఏ నిర్వహించిన వేలంలో ఓ ఫ్యాన్సీ నంబర్ రికార్డు ధర పలికింది. ఇంతకీ ఏ నంబర్ అంతటి ధర పలికింది..? దానిని దక్కించుకోవడానికి అంతగా పోటీపడింది ఎవరు..?

- Advertisement -

‘9999’కు పాతికన్నర లక్షలు :  హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఆర్‌టీఏ (ఖైరతాబాద్) కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ‘TG 09 G9999’ నంబర్‌కు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. పలు కార్పొరేట్ కంపెనీలు, సోనీ ఫైనాన్స్ వంటి సంస్థలు ఈ నంబర్ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి, ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, అత్యధికంగా రూ. 25.50 లక్షలు చెల్లించి ఈ ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకుంది.

ఒక్క రోజే.. రూ.63 లక్షల ఆదాయం : కేవలం ‘9999’ నంబరే కాదు, ఇతర ఫ్యాన్సీ నంబర్లకు కూడా మంచి ధర పలికింది. వేలంలో పాల్గొన్న ఇతర నంబర్లు రూ.1.01 లక్షల నుంచి రూ.6.25 లక్షల వరకు అమ్ముడయ్యాయి. ఈ ఒక్క రోజు వేలం ద్వారానే రవాణా శాఖకు ఏకంగా రూ. 63.7 లక్షల ఆదాయం సమకూరిందంటే, ఫ్యాన్సీ నంబర్లపై ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.

సెంటిమెంటే ప్రధానం : కొత్త వాహనం కొన్నప్పుడు, తమకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని భావించే నంబర్‌ను దక్కించుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. న్యూమరాలజీ, పుట్టినతేదీ, ఇతర సెంటిమెంట్ల ఆధారంగా నంబర్లను ఎంచుకుంటారు. కార్పొరేట్ సంస్థలు కూడా తమ కంపెనీకి కలిసి వస్తుందనే నమ్మకంతో ఫ్యాన్సీ నంబర్ల కోసం లక్షలు వెచ్చిస్తుంటాయి. ఈ వేలం పాటలు రవాణా శాఖకు నిధుల వరద పారిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad