Wednesday, April 2, 2025
HomeతెలంగాణHYDRAA | అమీన్‌పూర్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు

HYDRAA | అమీన్‌పూర్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA) సోమవారం అమీన్‌పూర్ లోని కొన్ని కట్టడాలపై కొరడా ఝుళిపించింది. ఇంటి యజమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ హైడ్రా అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఎవరు అడ్డొచ్చినా కూల్చివేతలను మాత్రం ఆపడం లేదు.

- Advertisement -

హైడ్రా (HYDRAA) సోమవారం ఉదయం అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని వందనాపురి కాలనీ సర్వే నంబర్ 848లో కూల్చివేతలను చేపట్టింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పలువురి ఇళ్లను కూల్చివేస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఇంటి యజమానులు ఆందోళన చేపట్టారు. కూల్చడానికి వీల్లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, హైడ్రా అధికారులు అవేమి పట్టించుకోవడం లేదు. అక్రమంగా నిర్మిస్తే కూల్చివేతలు తప్పవని తేల్చి చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News