Wednesday, October 30, 2024
HomeతెలంగాణI & PR Additional Director Nagayya Kamble retirement: పదవీ విరమణ ఉద్యోగానికి మాత్రమే

I & PR Additional Director Nagayya Kamble retirement: పదవీ విరమణ ఉద్యోగానికి మాత్రమే

పదవీ విరమణ..

ఐ అండ్ పి.ఆర్. డిపార్ట్మెంట్ లో 39 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు సేవలందించి బుధవారం నాడు పదవీ విరమణ చేసిన నాగయ్య కాంబ్లే అడిషనల్ డైరెక్టర్ ను ఐ అండ్ పి.ఆర్. లోని ఉన్నతాధికారులు, సహోద్యోగులు ఘనంగా సత్కరించారు.

- Advertisement -

ఐ అండ్ పి.ఆర్. డిపార్ట్మెంట్ కు ఆయన అందించిన సేవలను అంకిత భావంతో ఆయన నిర్వర్తించిన విధులను సహచర ఉద్యోగులు కొనియాడారు.  పదవీ విరమణ ఉద్యోగానికి మాత్రమేనని ఆయన శేష జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఉద్యోగులు ఆకాంక్షించారు.

ఈ పదవీ విరమణ కార్యక్రమంలో ఐ అండ్ పి.ఆర్. స్పెషల్ కమిషనర్ ఎస్ హరీష్, జగన్ జాయింట్ డైరెక్టర్, శ్రీనివాస్ జాయింట్ డైరెక్టర్, వెంకటేశ్వర్లు డిప్యుటీ డైరెక్టర్, సహచర సిబ్బంది పాల్గొని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News