Sunday, April 13, 2025
HomeతెలంగాణRonald Rose: తెలంగాణకు ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్

Ronald Rose: తెలంగాణకు ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్

ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్‌కు(Ronald Rose) కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌లో(CAT) భారీ ఊరట ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (DoPT) కేటాయించింది. అయితే కొన్ని కారణాలతో మళ్లీ తెలంగాణకు వచ్చి విధులు నిర్వహించారు. ఇటీవల ఆయనను ఏపీకి క్యాట్ కేటాయించింది. ఆ వెంటనే ఏపీలో రిపోర్ట్ చేశారు. కానీ తనను తెలంగాణలోనే కొనసాగేలా అవకాశం కల్పించాలని రెండో సారి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన ట్రైబ్యునల్ రోనాల్డ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన తెలంగాణలో రిపోర్ట్ చేయనున్నారు. క్యాట్ తీర్పు పరిపాలన వర్గాల్లో ఆసక్తికగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News