టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి కృతజ్ఞతతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆర్టీసీ ఉద్యోగులు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి, బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరువలేనిది అని, తమ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం ఫలితంగా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది, టిఎస్ఆర్టిసిని కాపాడుకోవాలని ప్రజా రవాణాను విస్తృతపరిచి మరింత పటిష్టంగా చేయాలని ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ నీ విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు వెంకట్ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, డి.ఎం. అశోక్ రాజ్, అసిస్టెంట్, ఏ.ఎం.సరస్వతి, నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.