ఫార్మాసిటీ భూ బాధిత రైతులతో ఏసీపీ కేపీవీ రాజు ఇబ్రహీంపట్నం డివిజన్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం జోన్ డీసీపీ సునీత రెడ్డి పాల్గొన్నగా భూ బాధిత రైతులైన మేడిపల్లి నక్కర్త, కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ నాలుగు గ్రామాల ఫార్మసిటీ భూ బాధిత రైతులతో డీసీపీ సునీత రెడ్డి రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఫార్మా భూ బాధిత రైతుల ఒకొక్కరి అభిప్రాయలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రైతులు తమ అభిప్రాయాలను తెలియపర్చారు.
భూములిచ్చేదే లేదు
రైతులందరు ఎట్టి పరిస్థితిలో మా భూములను ఇవ్వమని, తమ హక్కుల కోసం పోరాడుతామని చెప్పారు. ఈ సందర్బంగా ఫార్మసిటీ వ్యతిరేక పోరాట సమన్వయ కర్త కవుల సరస్వతి రైతుల తరపున మాట్లాడుతూరైతు బంధు రావడం లేదని, ఆన్లైన్ పేర్లు లేకపోవడంతో క్రాప్ లోన్ రావడం లేదని, ఎలాంటి లబ్ది చేకూరడం లేదని అన్నారు. హై కోర్టు ఆదేశాలను చూపించి దాని ప్రకారం అందరి రైతుల పేర్లు ఆన్లైన్ నమోదు చేయాలని, అలాగే రైతు భరోసా, రైతు బీమా ఇవ్వాలని, నిషేధిత జాబితా నుండి తొలగించాలని అన్నారు. కోర్టు ఆర్డర్ కాపీలను, ఆన్లైన్ లో పేర్లు లేని రైతుల లిస్టును డీసీపీ సునీత రెడ్డికి అందజేశారు. లాలూ అనే రైతు మాట్లాడుతూ ” నా కూతురికి పెళ్లి చేసి కట్నం కింద భూమి ఇచ్చాను, ఆ భూమి కట్నం కింద ఇవ్వడంతో వారి పేరున ల్యాండ్ బదిలీ కాకపోవడంతో తమ కూతురు ఆత్మహత్యకు చేసుకుంద”ని ఆవేదన వ్యక్తం చేశాడు.
గతంలో, ఇప్పుడు
గత ప్రభుత్వంలో ఫార్మసిటీకి యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో మొత్తం 20,000 ఎకరాలు భూమి సేకరణ చేయగా, అందులో 12000 ఎకరాల భూమి అసైన్డ్ ల్యాండ్ కాగా, మిగతా 8000 ఎకరాలు పట్టా ల్యాండ్ ఉంది. ప్రస్తుత ప్రభుత్వం 20,000 ఎకరాలు ల్యాండ్ కాకుండా యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త, కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ గ్రామాలకు సంబందించి 2500 ఎకరాల భూ సేకరణ కు నోటీసులు జారీ చేసింది. దింతో రైతులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. కొన్ని రోజుల క్రితం కలెక్టర్ రేట్ ఆఫీస్ ముందు ధర్నా దిగి తమ ఆందోళన చేస్తున్న సమయంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు జోక్యం చేసుకొని రైతులతో మాట్లాడి మంగళవారం రోజు రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ కు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని డీసీపీ సునీత రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఫార్మసిటీ, యాచారం, ఇబ్రహీంపట్నం సిఐలు లిక్కి కృష్ణంరాజు, జగదీష్, నరసింహరావు, ఫార్మసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్తలు కవుల సరస్వతి, కుందారపు నారాయణ, కమిటీ సభ్యులు కానమోని గణేష్, సందీప్ రెడ్డి, మైపాల్ రెడ్డి, లింగం, వినోద్, రాజు , అనసూయమ్మ, సామ నిరంజన్, మాజీ సర్పంచ్ లు ముత్యాల వెంకట్ రెడ్డి, దూస రమేష్, బందే రాజశేఖర్ రెడ్డి, నాలుగు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.