Saturday, November 15, 2025
HomeతెలంగాణTelangana: తెలంగాణ ప్రజలు తినే తిండి డేంజర్.. ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే.. ఐసీఎంఆర్‌ షాకింగ్‌ రిపోర్ట్‌..!

Telangana: తెలంగాణ ప్రజలు తినే తిండి డేంజర్.. ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే.. ఐసీఎంఆర్‌ షాకింగ్‌ రిపోర్ట్‌..!

ICMR Shocking Report on Telangana Food: మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని, మన జీవిత కాలాన్ని నిర్ణయిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, చాలా మంది జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడి నోటికి రుచికరంగా అనిపించే ఆహారాలను మాత్రమే తీసుకుంటారు. తద్వారా, చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే, ఒక్కో ప్రాంతంలో ఒక్కోరమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. అక్కడ లభించే ధాన్యాలు, వాతావరణ పరిస్థితులను బట్టి ఇవి మారుతుంటాయి. ఉదాహరణకు నార్తర్న్‌ స్టేట్స్‌లో గోధుమలతో చేసిన చపాతీలు ఎక్కువగా తీసుకుంటారు. కానీ సౌత్‌ స్టేట్స్‌లో మాత్రం వరి ఎక్కువగా పండుతుంది కనుక ఇక్కడ అన్నం ఎక్కువగా తింటారు. అయితే, ఎక్కువ సార్లు ఇలా అన్నం తినడం ప్రమాదకరమని ఐసీఎంఆర్‌ పరిశోధనలో తేలింది. తెలంగాణ ప్రజలు బ్యాలెన్స్‌ డైట్ పాటించడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ స్పష్టం చేసింది. శరీరానికి స్తోమతను ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవడం లేదని తెలిపింది. ఎక్కువగా పిండి పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నారని, వీటివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చి చెప్పింది.

- Advertisement -

అన్నమే ఎక్కువ మంది తీసుకుంటారని..

తెలంగాణ ప్రజలు తినే తిండిలో దాదాపుగా 67 శాతం అన్నమే ఉంటుందని ఐసీఎంఆర్‌ అధ్యయనంలో తేలింది. ఐసీఎంఆర్ దేశ వ్యాప్తంగా 1.24 లక్షల మంది నుంచి వారి ఆహారపు అలవాట్లపై వివరాలను సేకరించింది. అయితే, సాధారణంగా ఒక మనిషి రోజుకు 2 వేల క్యాలరీల ఫుడ్స్ తీసుకోవాలి. అందులోనూ 50 శాతం లోపు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండేలా జాగ్రత్తపడాలి. కానీ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే.. ఎక్కువ మంది ప్రజలు కేవలం 70 శాతం కార్బోహైడ్రేట్, 25 శాతం కంటే ఎక్కువగా కొవ్వు గల ఆహారాన్ని తీసుకుంటున్నారని తేలింది. ప్రొటీన్లు, విటమిన్లు, పండ్లు వంటివి తీసుకోవడం లేదని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. జొన్న రొట్టె, గోధుమ రొట్టె వంటివి తీసుకుంటున్నా వీటి వల్ల ఎలాంటి ఫలితాలు లేవని స్పష్టం చేసింది. పప్పులు, ఇతర తృణ ధాన్యాలను తక్కువగా తీసుకోవడంతో పాటు చికెన్, మటన్‌ వంటి అధిక కొవ్వు గల ఆహారాలను ఎక్కువగా తింటున్నారని పేర్కొంది.

అధికంగా మద్యం, ధూమపానం..

అన్నం ఎక్కువగా తింటున్న రాష్ట్రాల జాబితాలో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని రాష్ట్రాలు 99 శాతం అన్నమే తింటున్నాయి. మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తింటున్నారు. అన్నంతో పాటు జొన్నలు, సజ్జలు తీసుకుంటున్నా.. డైట్ ఏం మారడం లేదని అధ్యయనాల్లో తేలింది. ఇలా బ్యాలెన్స్ లేని డైట్ తీసుకోవడం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్‌లో ఎలాంటి పోషకాలు లేకపోవడం వల్ల షుగర్, గుండె జబ్బులు, ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ హెచ్చరించింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 68 శాతం గుండె, షుగర్ సంబంధిత వ్యాధులు బ్యాలెన్స్‌ లేని డైట్‌ తీసుకోవడం వల్లే వస్తున్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. అంతేకాదు తెలంగాణ ప్రజలు మద్యం, ధూమపానం వంటివి తీసుకోవడం కూడా కొలెస్ట్రాల్‌ పెరిగేందుకు కారణమని అధ్యయనంలో తేలింది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad