Saturday, April 12, 2025
HomeతెలంగాణIllandukunta: ఎంకేఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల వితరణ

Illandukunta: ఎంకేఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల వితరణ

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి, పోలీస్ స్టేషన్ కు నాలుగు కెమెరాలు చొప్పున మొత్తం 8 సీసీ కెమెరాలను ఎంకెఆర్ డెవలపర్స్ నిర్వాహకులు ఆలయ ఈవో కందుల సుధాకర్ కు, ఎస్ఐ తోట తిరుపతికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంకేఆర్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాదాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయనికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సీసీ కెమెరాలు అందజేసినట్టు తెలిపారు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంరక్షణలో, శాంతి భద్రతల నిర్వహణలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాంశర్మ, ఎస్సై తోట తిరుపతి, ఏఎస్ఐ ఆర్ రవీందర్ రెడ్డి, ఆలయ ఈవో కందుల సుధాకర్, మోహన్, రాజయ్య, మల్లారెడ్డి, అర్చకులు శేషం వంశీధరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News