Saturday, November 23, 2024
HomeతెలంగాణIllandukunta: తెలంగాణ దేశానికి ఆదర్శం

Illandukunta: తెలంగాణ దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ఉన్న నాయకుడని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఎమ్మెల్సీ సురభి వానిదేవితో కలిసి గ్రామంలో రూ,20 లక్షలతో నిర్మాణం చేపట్టిన హెల్త్ సెంటర్ ను, రూ,22 లక్షలతో నిర్మాణం చేపట్టిన రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధిలో ఎంతో మార్పు ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే గ్రామీణ వైద్యశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులకు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచే దిశలో విప్లవత్మకమైన మార్పు తీసుకువచ్చేందుకు రైతు వేదికలను ఏర్పాటు చేస్తూ ఆయా గ్రామాల పరిధిలోనే రైతులకు వ్యవసాయ పంటలపై సలహాలు సూచనలు ఇచ్చే విధంగా దృష్టి సారించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఎమ్మెల్సీ సురభి వానిదేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని, గత ప్రభుత్వాలు విస్మరించిన అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. అనంతరం గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలలో పాల్గొన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి చల్లని దీవెనలు గ్రామస్తులపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, సర్పంచ్ రఫీ ఖాన్, ఎంపిటిసి సభ్యులు చినరాయుడు, మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News