రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2023-2024 వ సంవత్సరంలో 10 వ.తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వాసంతి దేవి చారిటబుల్ ట్రస్ట్, ఎన్.వెంకట రామారావు ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ వారి ద్వారా లక్ష రూపాయలు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని గౌరవేణి మాన్యతకు 50 వేల రూపాయల నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన గజ్జల వర్షిని, గొడుగు శ్రీవాణి, గౌరవేణి భవ్యలకు ముగ్గురు విద్యార్థులకు 13వేల రూపాయల చొప్పున, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థిని వాడే శ్వేతకు 11 వేల రూపాయలను నగదు బహుమతిగా అందజేశారు.
అదేక్రమంలో ఈదులకంటి శ్రీనివాస్ రెడ్డి 5 కంప్యూటర్లు పాఠశాలకు వితరణ చేశారు. శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులు అతిథులుగా పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దామెర రవీందర్రావు, దామెర భరత్ రావు, దామెర శరత్ రావు, జోగినపల్లి శ్రవణ్, సురభి కమలాకర్ రావు, ప్రధానోపాధ్యాయురాలు బి రాణి, ఎస్ఎంసి చైర్ పర్సన్ ముత్యాలు, ఎంపీటీసీ బర్ల తిరుపతి, వాడే సంజీవరెడ్డి మారవేణి రమేష్ ఉపాధ్యాయులు తూముకుంట నరేందర్ రెడ్డి, ఐరెడ్డి ప్రదీప్ రెడ్డి, లావుడ్యా శ్రీను, గ్రామస్తులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.