Tuesday, July 2, 2024
HomeతెలంగాణIllanthakunta: ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు

Illanthakunta: ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు

ప్రతిభకు మరింత పదును..

ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలతో రేపటి యువతరం సరికొత్త మార్గదర్శకాలతో ముందుకు నడుస్తారని ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని ఈ నెల 5వ తేదీన ప్రారంభించి 23 రోజులకు చేరుకున్నది. వచ్చే నెల జూన్ మొదటి వారం వరకు ఈ శిక్షణా శిబిరం కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. ప్రతి రోజూ శిక్షణలో ఉదయం, సాయంత్రం శిక్షణకు వచ్చే క్రీడాకారులకు, అరటి పండ్లు, రక్షిత మంచినీటి సదుపాయం కల్పించామన్నారు. పోలీస్ శాఖ వారు పోలిస్ గ్రౌండ్ ను ఉచిత శిక్షణ శిబిరానికి వారి క్రీడా మైదానంను ఇవ్వడానికి అభ్యంతరం తెలిపి సహకరించకపోయిన వ్యవసాయ మార్కెట్ ప్రక్కన ఓపెన్ ప్లాట్ లలో క్రికెట్, ప్రభుత్వ పాఠశాలలలో కబడ్డి, వాలీబాల్ అటలలో శిక్షణ ఇస్తున్నామన్నారు.

- Advertisement -

ఇల్లంతకుంట మండలంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు వుండి కూడా సరైన ప్రోత్సాహం లేక పోవడంతోె ఎవరూ కూడా తమ సత్తాను నిరుపించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ వారు ప్రభుత్వ సహయంతో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించామని, గతంలో మండలం నుండి అత్యద్భుతమైన క్రీడా ప్రతిభతో మండలానికి మంచి గుర్తింపు తెచ్చారని స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు మామిడి రాజు తెలిపారు. శిక్షణలో పాల్గొనే క్రీడాకారులకు డ్రెస్ కోడ్, శిక్షణ సర్టిఫికెట్ ఇవ్వనున్నట్టు స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News