రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.వైన్స్ షాప్ యజమానుల ప్రోత్బలంతో బెల్ట్ షాపులు వారు రెచ్చిపోతున్నారు.ఎమ్మార్పీ రేటు కాకుండా అదనంగా వైన్ షాప్ లో బెల్ట్ షాపుల యజమానుల వద్ద వసూలు చేస్తూ,మందుబాబుల వద్ద బెల్టు షాపులు అధికంగా వసూలు చేస్తూ మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ విర్రవీగుతున్నారు.బెల్ట్ షాపులలో సిట్టింగులు పెట్టుకుంటూ వ్యూహరచనలు చేస్తూ న్నారు.గ్రామాల్లో బెల్ట్ షాపులను కట్టుదిట్టం చేస్తున్న పోలీసులు మండల కేంద్రంలో పట్టించుకోకపోవడం శోచనీయం అంటూ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోత్బలంతో వైన్స్ షాపుల యజమానులు రెచ్చిపోతున్నారని వినికిడి.బెల్టు షాపుల్లో ఎన్ని బీర్లు కావాలన్నా దొరుకుతున్నాయి.కానీ వైన్స్ షాపుల్లో ఒక బీరు కూడా దొరకడం లేదు,దీనికి ఏంటి సమాధానం అంటూ మందుబాబులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.బెల్ట్ షాపుల యజమానులు వైన్స్ షాపులలో వచ్చిన మందులపై స్టిక్కర్లు తీసివేసి అమ్ముతున్నారు.ఎక్కడి వైన్స్ షాపు నుంచి వచ్చినాయి అనేటువంటి ఆధారం లేకుండా వైన్ షాప్ ల యజమానులు బెల్ట్ షాపులకు ఇచ్చే స్టాకుపై స్టికర్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మద్యం అమ్మకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.కానీ మండల కేంద్రంలో మాత్రం మాకేంటి అన్నట్టు బెల్టు షాపులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు.ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందా లేదా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతుంది?ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే కలగజేసుకొని బెల్టు షాపులను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.