Tuesday, July 2, 2024
HomeతెలంగాణIllanthakunta: డ్రగ్స్ మహమ్మారిని నిర్ములిద్దాం..భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం

Illanthakunta: డ్రగ్స్ మహమ్మారిని నిర్ములిద్దాం..భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం

డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎస్సై ఎల్. రాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంను పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులతో కలసి బస్ స్టాండ్ ఆవరణలో ప్రతిజ్ఞ చేయించారు.

- Advertisement -

డ్రగ్స్ నిర్ములన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి, భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దాం పిలుపునిచ్చారు. యువత గంజాయి లాంటి మత్తుపదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు. సమాజంలో ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించటంలో యువత, ప్రజలు పోలీసు వారికి సహకరించుటలో కీలక పాత్ర పోషించాలని కోరారు.

అనంతరం ప్రజలతో ..” నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగ్యస్వామి అవుతానని,డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమానాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News