Thursday, July 4, 2024
HomeతెలంగాణIllanthakunta: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

Illanthakunta: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

వాణినికేతన్ పాఠశాలలో 2003-04 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణీనికేతన్ పాఠశాలలో ఆదివారం రోజు 2003-04 వ సంవత్సరంలో విద్యనభ్యసించిన 10 వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. విద్యార్థులందరూ 20 సంవత్సరాల కిందట పాఠశాలలో తాము విద్యను అభ్యసించిన తీరును, ఆడిన ఆటలు, పాడిన పాటలు, ఉపాధ్యాయుల బోధనలను నెమరు వేసుకున్నారు. తాము పాఠాలు నేర్చుకున్న తరగతి గదులన్నీ ఆనందంతో కలియతిరుగుతూ చిననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఆనాటి ఉపాధ్యాయుల ప్రేమ పూర్వక దండనలే మాకు ఈనాడు శ్రీరామ రక్ష అని, తమ అభివృద్ధికి మెట్లు అయ్యాయని కొనియాడారు.

- Advertisement -

ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానం చేరుకోవాలన్నా, జీవితంలో స్థిర పడాలన్నా ఆ వ్యక్తికి విద్యార్థి దశ నుండే మార్గనిర్దేర్శనం చేసేది ఉపాధ్యాయులు మాత్రమే అని పూర్వ విద్యార్థులు అన్నారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులంతా మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవుల్లో ఉండటం తమకు సంతోషంగా ఉందని, ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి అని ఆకాంక్షించారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేశారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు సార మల్లేశం, తూముకుంట్ల శ్రీనివాస్, ఎర్రోజు బ్రహ్మం, చేరాల రాజు, కొయ్యడ సత్యం, మద్దికుంట కనకయ్య, అనురాధ, అరుణ, అరుంధతి, స్వప్న, పూర్వ విద్యార్థులు సాదుల్, బాలకృష్ణ, రాజు, రాజేష్, అనీల్, మహిపాల్, శ్రీకాంత్, అభిలాష్, సంతోష్, శ్రీనివాస్, ప్రశాంత్, స్రవంతి, కళ్యాణి, వందన, సౌజన్య, లావణ్య, సుమలత, సునంద తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News