ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటించడంపై మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోలకు పాలాభిషేకం నిర్వహించారు.
- Advertisement -
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ఈ పాలాభిషేకం కార్యక్రమం సాగింది. కార్యక్రమంలో పసుల వెంకటి, అంతగిరి వినయ్ కుమార్, తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.