Friday, April 11, 2025
HomeతెలంగాణIllanthakunta-Teacher's day celebrated: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Illanthakunta-Teacher’s day celebrated: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

విద్యార్థుల శ్రేయస్సు కాంక్షించే గురువులు..

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిపారు. ముందుగా ప్రధానోపాధ్యాయురాలు ఎం.ప్రేమలత, డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల అలంకరించారు.
ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు గురువులను కూడా గౌరవించాలన్నారు. మనకు విద్యను అందించిన జ్ఞాన దాతలు, విద్యార్థుల శ్రేయస్సును కాంక్షించే వారే గురువులని తెలియజేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం ఒక మొక్కను (రామ ఫలం)నాటారు.

- Advertisement -

ఈ మొక్క ఎలాగైతే ఎదిగి వృక్షంగా మారి తీయటి ఫలాలను మనకు అందిస్తుందో అదేవిధంగా విద్యార్థులు కూడా బాగా చదివి ఉన్నతంగా ఎదగాలనే స్ఫూర్తితో ఈ మొక్కను నాటారు. ఆ తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మహేష్ చంద్ర, రమణారెడ్డి, మధుసూదన్ రావు, మంజుల, ప్రదీప్ రెడ్డి, లత, అనిల్ కుమార్, సునీత, పుష్పలత, కవిత, స్వప్న, సంపత్ రావు, సరిత, సత్తయ్య, ఫయాజ్ మహమ్మద్, సుజాత దేవి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News