Tuesday, September 10, 2024
HomeతెలంగాణIllanthakunta: అన్నపూర్ణ జలాశయంలోకి నీరు విడుదల

Illanthakunta: అన్నపూర్ణ జలాశయంలోకి నీరు విడుదల

కవ్వంపల్లి చేతుల మీదుగా..

మధ్య మానేరు జలాశయం నుండి అన్నపూర్ణ జలాశయంలోకి నీటి పంపింగ్ ను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి మండలంలోని అనంతగిరి గ్రామంలో వున్నా అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి రెండు మోటారుల ద్వారా నీటి పంపింగ్ ప్రారంభించామని, రెండు పంపుల ద్వారా సుమారు 6400 క్యూసెక్కుల నీరు అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి పంపింగ్ చేస్తామని తెలిపారు. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఎగువన వున్న ప్రాజెక్టుల నుండి నీటి పంపింగ్ చేస్తామని, రిజర్వాయర్ లో నీటిని నింపి ఇక్కడి ప్రాంత ప్రజలకు నీరు అందించిన తర్వాతే దిగువకు నీటిని విడుదల చేయాలనీ ఇరిగేషన్ అధికారులను కోరారు. క్రితం యాసంగి సీజన్ లో నీరు ఇతర ప్రాజెక్టులకు తరలించడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయని, ఈసారి అలా జరుగకుండా రైతుల పంట పొలాలకు నీరు అందేవిధంగా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News