రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో యువజన సంఘాల భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం యువజన సంఘాల సభ్యులు ఎమ్మెల్యేను గజమాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా యువజన సంఘాల అధ్యక్షుడు ఉప్పల అమరేందర్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వూట్కూరు వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, మానకొండూర్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, యూత్ కమిటీ నాయకులు,సభ్యులు ఎం.రాజు, రజనీకాంత్, బండారి రాజు, బాలకృష్ణ, రవితేజ, కార్తిక్, సుధీర్, శివరాం, సంతోష్, ప్రశాంత్, నిఖిల్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.