తెలంగాణలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్(Food poisoning) ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్(Karimnagar) పట్టణం శర్మ నగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
- Advertisement -
విద్యార్థులు రాత్రి కాలీఫ్లవర్, సాంబార్‌తో భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఇదే సమయంలో కడుపు నొప్పి రావడం, వాంతులు కావడంతో ఇబ్బంది పడ్డారు. వెంటనే పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థులను కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.