అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పార్టీ కార్యాలయాల్ని ప్రారంభించారు. ప్రచార యాత్ర గువ్వలేటి గ్రామం నుండి మొదలై చిన్నరావిరాల, బండరావిరాల, బాచారం, గౌరెళ్లి, తిమ్మాయిగూడ, కుత్బుల్లాపూర్, తారామతిపేట, సద్దుపెళ్లి, బలిజగూడా, కవాడిపెల్లి, అబ్దుల్లాపూర్ మెట్టు, jnurm గ్రామాల గుండా కొనసాగింది. ప్రతి గ్రామంలో జనం దయానంద్ గౌడ్ కు బ్రహ్మరథం పట్టారు.
ఈ సందర్బంగా స్థానిక బిజెపి నాయకులు మాట్లాడుతూ..ఇదే ప్రాంతంలో 420 రోజులు ధర్నా చేసినం. 1050 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, బండరావిరాల భూనిర్వాసితులకు న్యాయం జరగాలని పోరాటం చేస్తే రైతుల్ని జైల్లో పెట్టారు. 209 మందికి చెక్కులివ్వమని కొట్లాడితే ఎన్నికల ముందు ఇద్దరికిచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది బీఆరెస్ ప్రభుత్వం. ఇక్కడ స్టోన్ డస్ట్ మాఫియా రాజ్యమేలుతోందని, ప్రజల ప్రాణాలతో చేలాగాటమాడుతోందని అన్నారు. 2006 నుండి ఐదువందల మందికి ఇల్లు ఇస్తామని పేర్లు రాసుకొని ఇప్పుడు స్థానికేతరులకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ఇక్కడే మైనింగ్ మాఫియా ఇక్కడే తిష్ట వేసిందని మేము రోగాలతో సతమతమవుతున్నామని, ఇప్పటికే ఈ శ్వాసకోశ సంబంధ రోగాలతో ఇబ్బంది పడుతున్నామని అన్నారు.
బిజెపి పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్, మహారాష్ట్ర ఎమ్మెల్యే సందీప్ దుర్వే మాట్లాడుతూ..బీఆరెస్ పాలనకు అంతిమకాలం కాలం సమీపించిందని, తెలంగాణ లో బిజెపి జెండా ఎగురుతుందని అన్నారు.
మన బిడ్డల భవిష్యత్ బాగుంటాలంటే ఒక్కసారి బిజెపికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొండల్ రెడ్డి, నర్సింహారెడ్డి, పాపయ్య గౌడ్, వీరస్వామి గౌడ్, రంగ జంగమయ్య, పోరెడ్డి నర్సింహా రెడ్డి, వార్డు మెంబర్ నవీన్, పోలోజు అరుణ్, మహేష్ గౌడ్, రజినీకాంత్, అరుణ్, అశోక్, శ్రీనివాస్, సాయి కిరణ్, అఖిల్, రమాదేవి, మీనాక్షి, సురేఖ, బబ్బూరి సాయి, కట్ట సాయి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.