కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమం భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్, కొత్తపల్లి, భీమదేవరపల్లి, మల్లారం గ్రామాలలో ప్రారంభమైంది. గ్రామాల్లో ఉదయం ఎనిమిది గంటలకే ప్రజాపాలన కార్యక్రమం లో భాగంగా అభయాస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించారు. అభయాస్తం దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు, ఇల్లు, ఇతరత్రా అర్జీలు కూడా ఉన్నాయి.
గ్రామంలో ప్రజలు భారీగా తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. మహిళలు పురుషులకు వేరువేరు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, ట్రేని కలెక్టర్ శ్రద్ధ శుక్ల, డి ఆర్ డి ఏ శ్రీనివాస్ పర్యవేక్షించారు. వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది.ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముల్కనూర్ ఎస్సై సాయిబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, ఉపసర్పంచ్ సుద్దాల రఘు ధరఖాస్తు కౌంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులను లేకుండా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవడం జరిగినది. ఏర్పాట్లకు సంబంధించి తహసిల్దార్ వెంకట భాస్కర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ వెంకట భాస్కర్, ఎంపీడీవో భాస్కర్, పిడి శ్రీనివాస్, ఏపిఎం దేవానంద్ , ఏపీఓ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి జంగం పూర్ణచందర్, యువజన కాంగ్రెస్ నాయకులు పోగుల శ్రీకాంత్, చిట్కూరి అనిల్ జక్కుల అనిల్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.