Sunday, November 16, 2025
HomeతెలంగాణCheryala: పల్లాకు నిరసన సెగ

Cheryala: పల్లాకు నిరసన సెగ

షాక్ లో వెనుదిరిగిన పల్లా

పట్టభద్రుల ఎమ్మెల్సీ, జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జనగామ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురవెల్లి నుండి జనగామ వరకు భారీ బైక్ ర్యాలీగా వెళ్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా చేర్యాలలో రెవెన్యూ డివిజన్ జేఏసీ నాయకులు పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు.

- Advertisement -

నిరసనను గమనించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి దీక్ష శిబిరం వద్దకు వచ్చి జేఏసీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ జేఏసీ నాయకులు గో బ్యాక్ చేర్యాల ద్రోహి పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి వెనుతిరిగారు.

అటు జేఏసీ నాయకులు, ఇటు పల్లా వర్గీయుల నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరు వర్గాల నాయకులను చిదరగొట్టే ప్రయత్నం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad