Tuesday, September 17, 2024
HomeతెలంగాణChevella: చేవెళ్లలో శివాజీ జయంతి శోభాయాత్ర

Chevella: చేవెళ్లలో శివాజీ జయంతి శోభాయాత్ర

వీరత్వానికి ప్రతీక హిందూ సామ్రాట్

చత్రపతి శివాజీ మహారాజ్ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో చత్రపతి శివాజీ యువసేన మండల అధ్యక్షులు త్రినేత్ర ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం హాజరయ్యారు. ముందుగా చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకున్నారు. కాషాయం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ… చత్రపతి శివాజీ మహారాజ్ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కారని హిందూ దేశం కోసం ఔరంగజేబును దక్షిణ భారతదేశ వైపు రాకుండా చీల్చి చెండాడిన వ్యక్తి శివాజీ అని, అలాంటి ధైర్యవంతుడు పుట్టిన దేశంలో మనం జీవిస్తున్నామంటే మన అదృష్టమే అని అన్నారు. ముస్లిం రాజా పరిపాలనలో హిందువుల పట్ల నిరంకుశంగా మతమార్పిడి సాగుతున్న సందర్భంగా హిందూ సామ్రాజ విస్తరణ పై చత్రపతి శివాజీ చూపిన చొరవతో నేటి దేశం హిందూ దేశంగా కొనసాగుతుందని తెలిపారు. తన తల్లి జిజియా బాయ్ స్ఫూర్తితో హిందువుల ఐక్యత విస్తరణ కోసం భీకరమైన యుద్ధాలు చేసి ముస్లిం రాజుల నుంచి హిందువులను కాపాడిన ఘనత శివాజీ మహారాజ్ దేనని అన్నారు. ఆయన 16 ఏళ్ల వయసులోనే రాజ్యాధికారం చేపట్టి ఎలా అయితే చత్రపతిగా మారాడో అలాంటి గొప్ప శివాజీ చరిత్రను ప్రతి ఒక్క యువకుడు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఇందులో భాగంగా భాజపా యువ నాయకులు అత్తెల్లి అనంత్ రెడ్డి,మల్గారి డా. వైభవ్ రెడ్డి లు మాట్లాడుతూ… ధర్మం కోసం దేశ భక్తిశ్రద్ధలతో హిందూ ధర్మ స్థాపనకు ధైర్య సాహసాలు ప్రదర్శించి సాధించిన గొప్ప పాలన దక్షుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు.

- Advertisement -

కుల మతాలు స్వార్థము లేకుండా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారని తెలిపారు. దేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడు యోధుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. స్త్రీలను గౌరవించి హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన మహానుభావుడని గుర్తు చేశారు. నాడు జిజియా బాయ్ శివాజీ మహారాజ్ ని వీరునిగా తీర్చిదిద్దినట్లుగా నేటి తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యసహసాలు బోధించాలని కోరారు. యువకులు చెడువేసనలకు బానిసలు కాకుండా చత్రపతి శివాజీ మహారాజును ఆదర్శంగా తీసుకొని దేశ ధర్మ రక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం చత్రపతి శివాజీ మహారాజ్ , వివిధ ఇందు క్షేత్రాల యువకులు భారీ ఎత్తున పట్టణంలోని ప్రధాన రహదారులలో జయ నినాదాలతో శివాజీ మహారాజ్ వీరత్వాన్ని చాటుతూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. యువకులు జెండాలు, చేతబట్టి కర్ర సాములు చేస్తూ నృత్యాలు చేశారు. తదనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ, వివిధ ఇందు క్షేత్రాల యువకులు, వివిధ సంఘాల నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News