రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గార్ల మండల కేంద్రంలోని 14 వార్డులతో పాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారం విస్తృతంగా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి బీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకు నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ప్రజలు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండా వెంకట్ రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి ముల్కనూర్ ఎంపీటీసీ వెంకట్ లాల్ సర్పంచ్ అజ్మీరా బన్సిలాల్ వైస్ ఎంపీపీ కట్టె బోయిన శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కృష్ణ గౌడ్ శ్రీనివాస్ మీరా హతిరం కోటేష్ ఇమ్రాన్ మల్లి బాబు భూక్య నాగేశ్వరరావు తోడేటి శ్రీనివాస్ జానీ మియా పృధ్వి నాయక్ దీకొండ రాము పల్లా నర్సయ్య శ్రీనివాస్ రెడ్డి రావుజి ఉపేందర్ రెడ్డి కోల కుమార్ మండ రాము గౌడ్ బుచ్చి రాములు సారయ్య వీరస్వామి పందుల వీరన్న పల్లె పంగు నాగరాజు ఎస్ కే పాషా సిపిఐ పార్టీ మండల నాయకులు జంపాల వెంకన్న కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వినోద తదితరులు పాల్గొన్నారు.