రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపేధ్యేయంగా ఉద్యమకారులు కలసికట్టుగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి తోడేటి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తోడేటి శ్రీను గౌడ్ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ కొమరాజు జగదీష్ లు మాట్లాడుతూ ఉద్యమకారులు విద్యార్థులు మేలుకోవాలని, బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల విద్యార్థుల జీవితాలతోటి ఆడుకున్నదని బంగారు తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారమయం అయ్యిందని ఆరోపించారు. ఉద్యమకారులు అందరు కలిసి నియోజకవర్గలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని అందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల ఉద్యమకారులు ఎస్ కే జానీ మియా, వీరస్వామి, భూక్యా శీను తదితరులు పాల్గొన్నారు.