ముంగి రమేష్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ అన్నారు. సిపిఐ పార్టీ శాఖ కార్యదర్శి ముంగి రమేష్ 8వ వర్దంతి వేడుకలను గార్ల మండల పరిధిలోని మద్దివంచ గ్రామంలో ఆయన స్మారక స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత స్తూపానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెభోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ రమేష్ మరణం పార్టీకి తీరని లోటని, ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేశారని, వ్యవసాయ కార్మికులు కూలీలు సమస్యలపై అలుపెరగని ఉద్యమం చేశారని అన్నారు.
ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రాగం రమేష్, శాఖా కార్యదర్శి దూపాటి జనార్దన్, కట్టెభోయిన భిక్షమయ్య, ఇలుటూరి వెంకన్న, దారావత్ వీరన్న, లావుడ్య భీముడు నాయక్, కట్టెభోయిన పిచ్చయ్య, మల్లారపు భిక్షం, రాగం సత్యం, రాగం రాము, గుగులోత్ సకృ, పొన్నం వెంకన్న, ముంగి సాయి, ప్రవీణ్, సయ్యద్ సర్వర్, దాదేమియా, వెంకన్న పాల్గొన్నారు.