Thursday, September 19, 2024
HomeతెలంగాణGarla: హోరాహోరీగా ప్రచారం

Garla: హోరాహోరీగా ప్రచారం

ఇంటింటా ప్రచారం

గార్ల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ బజార్ బెస్త బజార్ ఎరుకల బజార్ వడ్డెర బజార్ జెండా బజార్ లలో ఎంపిటిసి శీలంశెట్టి రమేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత హరిప్రియ నాయక్ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇల్లందును అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించామన్నారు. ప్రతి గ్రామంలో సాగు, తాగు నీటి కోసం కృషిచేశామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణాల కోసం పూర్తి స్థాయి నిధులను మంజూరు చేయించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు వేయించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వివిధ రకాల పథకాలు అందించిందన్నారు. మరోసారి హరిప్రియ నాయక్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి బిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికను పంపిణీ చేసి ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ వెంకటేష్ షఫీ పాష సోషల్ మీడియా కన్వీనర్ వల్లపు దాసు వెంకటేశ్వర్లు గులగట్టు బాబు తాళ్లూరి శ్రీనివాస్ అలవాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News