Saturday, November 23, 2024
HomeతెలంగాణGarla: సృజనాత్మకతను వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శన

Garla: సృజనాత్మకతను వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శన

మెదడుకు పదును పెట్టేలా..

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు విధ్యావైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రిన్సిపాల్ సిస్టర్ జైస్ అన్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక నిర్మల హై స్కూల్ లో వైస్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ సిస్టర్ లు సిని శలెట్ ల ఆధ్వర్యంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫాదర్ దిలీప్ ఫాదర్ కిరణ్ లు విచ్చేసి విద్యార్థులు తయారుచేసిన పర్యావరణ రహిత వస్తువులు ఆరోగ్యం పాడి పంటలు చంద్రయాన్ శుభ్రత అగ్నిపర్వతం లాంటి సుమారు 100 కళాఖండాల ప్రదర్శనలు ఏర్పాటు చేయగా వాటిని తిలకించారు విద్యార్థులు యువ సంకీర్త్ భవిష్ రూపొందించిన అగ్నిపర్వతం ప్యూర్ వాటర్ కళా కండాలు ఎంత గానో ఆకట్టుకున్నాయి.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూమనిషి జీవితంలో ప్రతి మెట్టులోనూ సైన్స్‌ ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. సైన్స్‌ లేనిదే జీవితం లేదన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసే లక్ష్యంతో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా వినూత్న ఆలోచనలతో విద్యార్థులు ముందుకు వెళ్లేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు.

ప్రధానంగా వాతావరణ కాలుష్యం, ప్లాస్టిక్‌ వినియోగం వంటివి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు రూపొందించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో సిస్టర్స్ రోస్మిన్ జేర్లిన్, జీనా ఉపాధ్యాయులు నరేష్ ప్రవీణ్ రవి శేఖర్ పవన్ సురేందర్ శివ కృష్ణ బాలస్వామి శ్రీనివాస్ నాగమాల సరిత శిరోమణి కళ్యాణి బంగారమ్మ కరుణ సాహితీ రమణ వాణి నితిన్ సోనా లావణ్య రీమా విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

బాస్కెట్ బాల్ కోర్టు ఆవిష్కరణ

ఆటలు ఆడటం వలన మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని ప్రిన్సిపల్ కరస్పాండెంట్ సిస్టర్ లు జైస్ శాలెట్ లు అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక నిర్మల హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బాస్కెట్ బాల్ కోర్టు ఆవిష్కరణ కార్యక్రమానికి విచారణ గురువు ఫాదర్ దిలీప్ సహాయక గురువు కిరణ్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్య సాధన దిశగా నిరంతరం శ్రమించాలని అందుకు చదువుతో పాటుగా క్రీడలపై దృష్టి సారించి క్రీడల్లో రాణించి, జాతీయ స్థాయికి ఎదగి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ సినీ సిస్టర్స్ రోష్మిన్ జెర్లిన్ జీనా ఉపాధ్యాయులు నరేష్ ప్రవీణ్ రవి శేఖర్ పవన్ సురేందర్ శివకృష్ణ బాలస్వామి శ్రీనివాస్ నాగమాల సరిత శిరోమణి కళ్యాణి సాహితీ రమణ వాణి నితిన్ సోనా లావణ్య రీమా విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News