Friday, September 20, 2024
HomeతెలంగాణGarla: వైభవంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

Garla: వైభవంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

నిరుపేద క్రైస్తవులకు బట్టల పంపిణీ

మానవులు ఎప్పుడూ ప్రేమ, కరుణ, క్షమను కలిగి ఉండాలని ఏసు క్రీస్తు చేసిన బోధనలు మానవాళికి అనుసరణీయమని సర్పంచ్ అజ్మీర బన్సీలాల్ పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఎస్ ఐ బానోతు వెంకన్నలు అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. తొలుత పాస్టర్లు కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి ముందస్తు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు.

- Advertisement -


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ క్షమాగుణంతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే యావత్ ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని ఏసుక్రీస్తు ఈ లోకంలోని ప్రజలందరికీ ప్రేమ, అప్యాయతను నేర్పించారని, ఎదుటివారిని ప్రేమించేగుణం మనలో ఉండాలని, ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటించాలన్నారు.


ప్రతి పేదవాడు పండుగ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంస్కృతులు సంప్రదాయాలను గౌరవిస్తూ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ నాయక్ ఆర్ ఐ స్వప్న రామకృష్ణ పాస్టర్లు పాల్ జోసెఫ్ ఇస్సాకు జాన్ పాల్ థామస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News