Saturday, October 5, 2024
HomeతెలంగాణGarla: డిమాండ్లకై పట్టుబడుతున్న తపాలా ఉద్యోగులు

Garla: డిమాండ్లకై పట్టుబడుతున్న తపాలా ఉద్యోగులు

డిమాండ్లు తీరేవరకు నిరవధిక సమ్మె

గ్రామీణ తపాల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు బండి జయరాజ్ పట్టాభి రామయ్యలు డిమాండ్ చేశారు. నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ బ్యాంక్ సేవ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు విధులు బహిష్కరించి స్థానిక తపాలా కార్యాలయం ఎదుట తపాలా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ నిరవధిక సమ్మకు సిపిఎం, సిపిఐ న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు కందునూరి శీను జంపాల వెంకన్న సక్రులు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించారు. 8 గంటల పనితో పాటుగా తపాలా ఉద్యోగులకు పెన్షన్ తో సహా అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని సీనియర్ జిడిఎస్ ఉద్యోగులను 12 24 36 సంవత్సరాల సర్వీస్ కు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసి ఆర్థిక ఉన్నతి కల్పించాలన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 50 వేల రూపాయలకు పెంచాలని పెయిడ్ లీవ్ ను 180 రోజుల వరకు దాచుకొని నగదుగా మార్చే సౌకర్యం కల్పించాలని కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన బంచింగ్ ను అమలు చేయాలని కోరారు. ఎస్ డి బి ఎస్ కు జిడిఎస్ కాంట్రిబ్యూషన్ 10% డిపార్ట్మెంట్ 10 శాతం కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని తాత్కాలిక పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. టార్గెట్స్ మేళా రూపంలో జిడిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులు ఆపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మౌలాలి మహమ్మద్, వెంకటేశ్వర్లు, రియాజ్, రామకృష్ణ, జిడిఎస్ లు జమీలా, అనూష, అరుణ్, చంద్రశేఖర్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News