Thursday, September 19, 2024
HomeతెలంగాణGarla: ప్రజా పాలనతో ప్రజలకు భరోసా

Garla: ప్రజా పాలనతో ప్రజలకు భరోసా

ప్రజాపాలన ఫారంల కొరత

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమం ద్వార ప్రజలకు భరోసా కల్పిస్తామని జెడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ లు పేర్కొన్నారు. గార్ల మండల కేంద్రంలో స్థానిక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలో పాల్గొని దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం కోసం తలపెట్టిన 6 గ్యారెంటీ పథకాలకు అర్హులైన ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో రవీందర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణంతో పాటుగా హై స్కూల్ ప్రాంగణంలో 26 దరఖాస్తు కౌంటర్లను ఏర్పాటు చేశారు. దరఖాస్తు ఫారాలను స్వీకరించేందుకు ఐకెపి ఈజీఎస్ ఏఎన్ఎం కార్యదర్శులతో పకడ్బందీగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

- Advertisement -

ప్రజా పాలన గ్రామసభలో దరఖాస్తు కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం టెంట్లు వైద్య సిబ్బంది చేత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని పలు వార్డులలో ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తులు ఫారాలు అందకపోవడంతో పలు కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు లేక ప్రజలు అవస్థలు పడ్డారు. దరఖాస్తుదారులు ప్రజా పాలన గ్రామ సభలో ఆందోళన నిర్వహించగా కొంతసేపు గందరగోళం తలపించడంతో ఎంపీడీవో రవీందర్ కలగజేసుకొని తక్షణమే అభయ హస్తం ఫారాలను తెప్పించి ఆందోళన నిర్వహించిన దరఖాస్తుదారులకు ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పట్టణ వ్యాప్తంగా 2,730 దరఖాస్తులు అందజేశామని, అందులో 1819 దరఖాస్తు ఫారాలు వచ్చాయని, జనరల్ కేటగిరీలో 296 ప్రజా పాలన గ్రామసభల ద్వారా స్వీకరించామని, జనవరి 6వ తారీకు లోపు మిగతా 911 దరఖాస్తు ఫారాలను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్వీకరించి ఆన్లైన్ చేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రవీందర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బాలరాజు ఉపసర్పంచ్ ఉమామహేశ్వరరావు మండల వ్యవసాయ శాఖ అధికారి రామారావు ఏపీవో సుజన్ స్వరూప్ ఏపీఎం నరేందర్ కుమార్ ఎంపీ ఓ రజిని ఎస్సై జీనత్ కుమార్ పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ రవీందర్ మంగీలాల్ సుధాకర్ పంచాయతీ కార్యదర్శులు ఐకెపి సిబ్బంది ఈజీఎస్ సిబ్బంది వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News