గ్రామీణ పట్టణ ప్రజలకు సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న రుణ సౌకర్యాలు ప్రతి ఒక్కరు కూడా పొదుపు ఖాతా తెరవాలని పొదుపు ఖాతా వలన అనేక లాభాలు పొందవచ్చునని ఏపీజీవీబీ మేనేజర్ సిహెచ్ సాయికుమార్ అన్నారు. గార్ల మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో ఏపీజీవీబీ గార్ల బ్రాంచ్ ఎఫ్ ఎల్ సి కౌన్సిలర్ ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సును కేఎస్ రూరల్ కళాజాత బృందంచే బ్యాంకులో ఉన్నటువంటి పథకాల గురించి బ్యాంకు అందించే రుణాలు జీవనజ్యోతి బీమా యోజన పథకం సురక్షిత భీమా అటల్ పెన్షన్ యోజన పథకం జనరల్ ఇన్సూరెన్స్జన్ ధన్ యోజన ఖాతా మొబైల్ బ్యాంకింగ్ ఆన్లైన్ సేవలు బ్యా సైబర్ నేరాలపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో కాజాత బృందం మాటలు పాటలు మ్యాజిక్ షో ద్వారా ఖాతాదారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మేనేజర్ సాయికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా వడ్డీ రాయితీ వస్తుందన్నారు. డిపాజిట్స్ పై అత్యధిక వడ్డీ ఇస్తున్నామని గోల్డ్ లోన్స్ తక్కువ వడ్డీకే రుణాలు అందించడం జరుగుతుందని ఖాతాదారులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని డైరీ ఫ్రామ్ కోళ్ల ఫారం ఫిషరీ ఫ్రామ్ కోల్డ్ స్టోరేజీ హార్వెస్టర్ వాటికి రుణాలు అందిస్తామని, ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు అందించే బీమా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా సురక్ష బీమా అటల్ పెన్షన్ యోజన పథకాలలో అర్హులైన ఖాతాదారులు చేరాలన్నారు. ఎస్ బి ఐ జనరల్ ఇన్సూరెన్స్ తో వెయ్యి రూపాయలతో 20 లక్షల ప్రమాద బీమా ఉందన్నారు పదివేల ఐదువందల రెండు రూపాయలతో మూడు లక్షల ఆరోగ్య భీమా ఉందని వివరించారు. అపరిచిత వ్యక్తులు చేసే మోసపూరిత ఫోన్ కాల్ సమాచారం అందించవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రేమ్ కుమార్ బ్యాంకు మిత్ర మంజుల రైతులు రూరల్ ప్రతాప్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.