Saturday, October 5, 2024
HomeతెలంగాణKarepalli: నాణ్యతకు తిలోదకాలు?

Karepalli: నాణ్యతకు తిలోదకాలు?

కమిషన్ల కోసమే కక్కుర్తి

గతంలో వర్షాలు కురిస్తే పల్లెల్లోని వీధులలో కాలి నడక నడవలేని దుస్థితి నెలకొంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం ప్రధాన ఎజెండాగా తీసుకొని వంద మీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రత్యేక నిధులు సమకూరుస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కాంట్రాక్టర్లు సంబంధిత పంచాయతీరాజ్ అధికారులతో కుమ్మకై సీసీ రోడ్ల నిర్మాణలో నాణ్యతకు తిలోదకాలు చేస్తున్నారని విమర్శలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం లక్ష్యం నీరు కారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్శనం సింగరేణి మండలంలోని మేకలతండా పంచాయితీలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ ద్వారా 10 లక్షలతో వ్యయంతో సుమారు 200 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, నాసిరకం ఇసుక వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఓ అధికారి ఉండి కూడా లోకల్ ఇసుక వాడడంతో గ్రామస్తులు కాంట్రాక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ కరువై కాంట్రాక్టర్లు లోకల్ ఇసుక వాడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
కమిషన్లకు కక్కుర్తి పడి కొందరు అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణ పనులకు లోకల్ ఇసుక ఉపయోగిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, నాణ్యమైన రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నారు. అక్కడే ఉన్న పంచాయతీరాజ్ అధికారి వ్యక్తిగత వర్క్ ఇన్ స్పెక్టర్ వివరణ కోరగా రోడ్డు నిర్మాణానికి లోకల్ ఇసుక ఉపయోగిస్తున్నా ఆ ఇసుక మాది కాదని పొంతనలేని సమాధానం ఇవ్వడం కొసమెరుపు.

- Advertisement -

ఎవరైనా సరే సిసి రోడ్ నిర్మాణాల్లో ప్రభుత్వ ప్రామాణికంగా గోదావరి ఇసుక వాడాలని లేనియెడల నిర్మాణ పనులను పర్యవేక్షించి సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ ఏఈ వాసు తెలిపారు. గ్రామస్థులు చెబుతున్న ఆరోపణల విషమై ప్రశ్నించగా ఆ విషయం మా దృష్టికి రాలేదని ఆయన చెప్పటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News