కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ అధికారులందరూ నాలుగు ముఖ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు, నాన్ బెయిలబుల్ వారెంట్ల ఎగ్జిక్యూషన్, గత ఎన్నికల్లో నమోదైన కేసుల పురోగతి, సైబర్ నేరాల నియంత్రణపై పలు సూచనలు చేశారు. బాధితుల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే త్వరితగతిన స్పందించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. నాన్ బెయిలబుల్ వారింట్ ల అమలు నిరంతరం కొనసాగించాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిపి రాజు, లక్ష్మినారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Karimnagar: పోలీసులకు అభిషేక్ మహంతి కీలక సూచనలు
కంప్లైంట్స్ అందగానే స్పందించాల్సిందే