అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఎల్బి నగర్ బారాస పార్టీ అభ్యర్థి,శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చైతన్యపూరి డివిజన్ పరిధిలోని మున్సిపల్ కాలనీ, ఇంద్రనగర్ కాలనీ మరియు చుట్టుపక్కల కాలనీల యందు పాదయాత్ర చేశారు. బస్తీవాసులు సుధీర్ రెడ్డికి అడుగడుగునా పూలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బస్తీవాసులు మాట్లాడుతూ..ఎన్నో ఇండ్ల నుంచి ఇండ్ల పట్టాల సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మీరు పట్టాలు ఇప్పించారన్నారు. బస్తీవాసుల పూర్తి మద్దతు మీకే ఉంటుందన్నారు. సుధీర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు పరిష్కరించాడని ఆయన చెప్పుకున్నారు.
నియోజకవర్గం మీద అవగాహన లేని కొత్త కొత్త నాయకులు వస్తున్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు. నిజామాబాద్ నుంచి తరిమికొడితే ఇక్కడ వచ్చి పడ్డాడు. నిజామాబాద్ లో చెల్లని రూపాయి హైదరాబాదులో చెల్లుతుందాని నిలదీశారు. అంతెందుకు వారి సొంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గొనే ప్రకాష్ రావు వారి పార్టీ నాయకులు అయిన మధుయాష్కీ మీద గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ వీసాలు, నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించి ఎంతో మందిని మోసం చేశాడని, వారి మీద పోలీస్ స్టేషన్లో 420 కేసులు కూడా నమోదయ్యాయన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు యూట్యూబ్ లో ఉన్నాయని అన్నారు. ఇలాంటి వారు వచ్చి మేము అభివృద్ధి చేస్తామని అనడం హాస్యాస్పదమన్నారు. బలమైన క్యాడర్ లేకపోయినా అత్యాశతో పోటీ చేస్తున్నాడని తెలిపారు.
బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సామ రంగారెడ్డి సొంత బంధువుల పొలాలు కబ్జా పెట్టడం వల్ల వారి బంధువులే వారి మీద దాడి చేయడం నిజం కాదా అన్నారు. ఇంట్లో వారే ఆయనకు ఓట్లు వేయనప్పుడు ప్రజల ఓట్లు ఎలా వేస్తారన్నారు. దొంగలకు, కబ్జాకోరులకు నియోజకవర్గంలో స్థానం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నర్సిరెడ్డి, పవన్, శరత్ చంద్ర, నరేష్, చిన్నా యాదవ్, శ్రీహరి, నాగలక్ష్మి, జ్యోతి, జయశ్రీ, పావని, సంగీత, అనిత, సుదర్శన్, గట్టు శ్రీను, కిరణ్, కృష్ణ, సంతోష్ యాదవ్, మధు గౌడ్ పలువురు బస్తీవాసులు పాల్గొన్నారు.